నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మొదటి నామినేషన్ దాఖలైంది. తెరాస తరఫున లోయపల్లి నర్సింగరావు నామపత్రాలు దాఖలు చేశారు. కలెక్టరేట్లో పాలనాధికారి నారాయణరెడ్డికి పత్రాలు అందించారు. ఈనెల 19తో నామినేషన్ గడువు ముగియనుంది. గతంలో తెరాస తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఎవరీ నర్సింగరావు..
లోయపల్లి నర్సింగరావు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎంపీపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రధాన అనుచరుడిగా పేరున్న నర్సింగరావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాసలో చేరారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ గెలవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
తెరాస అధికారికంగా ఎవరి పేరునూ ఇంకా ప్రకటించకపోయినా.. నర్సింగరావు గులాబీ పార్టీ తరఫున నామపత్రాలు సమర్పించారు.
ఇవీచూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం