ETV Bharat / state

నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఎన్నికైనా విలక్షణ తీర్పే - ఈసారి ఓటరు చూపు ఎటువైపో? - నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు

Nizamabad Politics Telangana Assembly Election 2023 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతున్న కామారెడ్డి నియోజకవర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందూరు జిల్లాలో మూడు పార్టీలు.. హోరాహోరీగా తలపడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఉండగా.. కొన్ని స్థానాల్లో ద్విముఖ పోరు నెలకొంది. అభ్యర్థులంతా విజయంపై ధీమాతో ఉండగా.. ఓటర్ల నాడి మాత్రం అంతు చిక్కడం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఎన్నికైనా విలక్షణ తీర్పు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా.. ఈసారి ఎలాంటి ఫలితాలు ఉంటాయోనని.. అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి.

MLA Candidates in Nizamabad District
Nizamabad Politics Telangana Assembly Election 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 8:34 AM IST

నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఎన్నికైనా విలక్షణ తీర్పే-ఈసారి ఓటరు చూపులు ఎటువైపో?

Nizamabad Politics Telangana Assembly Election 2023 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే కామారెడ్డి నియోజకవర్గం.. అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌(CM KCR) ఇక్కడి నుంచి పోటీ చేయడమే అందుకు కారణం. కేసీఆర్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది.

బీజేపీ నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్‌ వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. నేరుగా సీఎం బరిలో ఉండటంతో.. గజ్వేల్‌ను మించి అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తానని షబ్బీర్‌ అలీ చెప్పినా.. చివరకు రేవంత్‌రెడ్డికి వదిలేయాల్సి వచ్చింది. క్యాడర్‌ బలంగా ఉండటంతో గెలుపుపై చెయ్యి పార్టీ నమ్మకంతో ఉంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సైతం విజయంపై ధీమాగా ఉన్నారు. మాస్టర్‌ ప్లాన్‌పై(Master Plan) పోరాడటం, భూదందాల మీద ఆందోళనలు చేయడం కలిసొస్తుందని భావిస్తున్నారు.

MLA Candidates in Nizamabad District : ఎల్లారెడ్డి నియోకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సురేందర్‌.. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుభాశ్‌రెడ్డితో నువ్వా-నేనా అన్నట్టు జరిగిన పోరాటంలో.. కాంగ్రెస్‌ టికెట్‌ చివరకు మదన్‌మోహన్‌రావుకి దక్కింది. అసంతృప్తితో పార్టీని వీడిన సుభాశ్‌రెడ్డి.. కమలం నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్(Congress Vs BRS) మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు జాజాల సురేందర్‌కు బలంగా మారతాయని భావిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

బాన్సువాడ నియోజకవర్గంలో సీనియర్‌ నేత, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam Srinivasa Reddy) బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. వరుస గెలుపులతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారు. అన్ని గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించడం సానుకూలాంశంగా ఉంది. ఇతర నియోజకవర్గాల నుంచి వలస వచ్చిన ఏనుగు రవీందర్‌రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ... పోచారానికి ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాల్సి ఉంది.

Nizamabad Latest Politics : జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, భారతీయ జనతా పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే అరుణతార బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి ఎన్నారై లక్ష్మీకాంతరావును బరిలోకి దింపారు. మూడు సార్లు గెలిపించినా అంచనాలకు తగ్గట్టుగా పనులు చేయలేదనే అసంతృప్తి.. షిండేకు ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన ఎన్నారై లక్ష్మీకాంతరావు గురించి ఇంకా నియోజకవర్గ ప్రజలకు తెలియదు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆయన మేనత్త ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తున్నారు.

గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే - అందుకే హ్యాట్రిక్​పై అంత ధీమాగా ఉన్నాం : మంత్రి కేటీఆర్

గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌(Orange Travels) అధినేత ముత్యాల సునీల్‌ రెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. రైతుల కోసం 20కిపైగా చెక్‌ డ్యామ్‌ నిర్మించడం, ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం పూర్తి చెయ్యడం.. మంత్రి వేముల రాజకీయ జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. కేంద్రం జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం.. బీజేపీకు కలిసి వచ్చే అంశంగా ఉంది. అన్నపూర్ణమ్మ మంత్రికి సమీప బంధువు కావడంతో.. బంధుగణం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. కాంగ్రెస్‌ సైతం బలంగా ఉండటంతో.. బాల్కొండలో త్రిముఖ పోరు నెలకొంది.

Telangana Assembly Elections 2023 : ఆర్మూర్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే(Sitting MLA) జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వినయ్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ఆర్ఐ రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఇప్పటికే నిరసన సెగలు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్‌, కమలం పార్టీ అభ్యర్థులు ఎంత మేరకు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారనేది కీలకంగా మారింది.

చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో కేసీఆర్ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ, బీజేపీ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. ఐటీ హబ్‌ సాధన, ఉద్యోగాల కల్పన, నగరంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ(Drainage System) పూర్తి చెయ్యడం వంటివి బిగాల గణేశ్‌కు సానుకూలాంశాలుగా ఉన్నాయి. అధికార పార్టీ అభ్యర్థి మాదిరిగానే వైశ్య సామాజిక వర్గానికి చెందిన సూర్యనారాయణను బీజేపీ బరిలోకి దించడం.. పోటీని ఆసక్తికరంగా మార్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ.. మైనార్టీ ఓటర్ల మీద ఆశలు పెట్టుకున్నారు.

Election Campaign in Telangana : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి కులాచారి దినేష్‌ పోటీ చేస్తున్నారు. ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న చెక్‌డ్యామ్‌లు, వంతెనలు, రోడ్లు పూర్తి చెయ్యడం, మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణ దశలో ఉండటం.. బాజిరెడ్డికి సానుకూలంశాలుగా ఉన్నాయి. బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే షకీల్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రైస్‌ మిల్లర్‌ల నాయకుడు వడ్డి మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు.

తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే

నియోజకవర్గంలో ప్రభావం చూపేలా అభివృద్ధి పనులు చెయ్యకపోవడం, స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం షకీల్‌కు ప్రతికూలాంశంగా ఉన్నాయి. మైనార్టీ ఓట్లు కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్‌ క్యాడర్(Congress Cadre) బలంగా ఉండటంతో సుదర్శన్‌రెడ్డి గట్టి పోటీస్తున్నారు. బోధన్‌ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామనే హామీతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ.. ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన అన్ని పార్టీలు.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. భిన్నమైన తీర్పును ఇచ్చే అలవాటు ఉన్న నిజామాబాద్‌ ప్రజలు.. ఈసారి ఎటు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ నెలకొంది.

సమైక్యవాది పవన్‌ కల్యాణ్‌తో ఈటల రాజేందర్‌ ఎలా కలుస్తారు : మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.