ETV Bharat / state

సౌదీలో నిజామాబాద్​ యువకుని మృతి

ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన నిజామాబాద్​కు చెందిన ఓ యువకుడు అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సౌదీలో నిజామాబాద్​ యువకుని మృతి
సౌదీలో నిజామాబాద్​ యువకుని మృతి
author img

By

Published : May 8, 2020, 5:18 PM IST

ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన నితిన్(22) అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. నితిన్​ నాలుగు నెలల కింద సౌదీ వెళ్లాడు. నెల రోజుల పాటు పని సజావుగా సాగింది. ఇంతలోనే అక్కడ లాక్​డౌన్ విధించడం వల్ల ఉపాధి కోల్పోయాడు.

కొన్ని రోజులుగా తిండి, నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో రెండు రోజుల చికిత్స పొందిన అనంతరం మృత్యువాత పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. నితిన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.