బోధన్‌లో ఒకే ఇంటి నుంచి అనేక నకిలీ పాస్‌పోర్టులు జారీ చేసినందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. పాస్‌పోర్టుల వ్యవహారంలో జిల్లా పోలీసు శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ వ్యవహారంలో ఆధార్ కార్డుల రీసర్వే చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామన్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌లకు లేఖ రాస్తామని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్, బోధన్‌లో తెరాస నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు హస్తముందని ఆరోపించారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన