న్యాయవాద వృత్తి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాద దంపతుల కుటుంబాన్ని పరామర్శించడానికి ఛలో గుంజపడుగు యాత్ర చేపట్టారు. బాధిత న్యాయవాది కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.
హత్య కేసును సీబీఐ చేత గాని లేక ఇతర ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగాని విచారణ జరపాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ డిమాండ్ చేశారు. సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డితో పాటు 150 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర