నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో ధాన్యం కొనుగోళ్లపై... రైస్‌మిల్లర్స్, ట్రేడర్స్, పీఏసీఎస్ ఛైర్మన్, డీసీబీ డైరెక్టర్స్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వాదేశాల మేరకు రైతులు సన్నరకాలు ఎక్కువ పండించారని.. కలెక్టర్ తెలిపారు. దొడ్డు రకాలు తక్కువ పండాయని.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండిస్తే.. పండించిన రైతుకు, ట్రేడర్‌కు, వినియోగదారునికి అందరికీ లాభం జరుగుతుందని అన్నారు. రైతుకు మంచి ధరను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రబీలో 357 కొనుగోలు సెంటర్లు ఉంటే ప్రస్తుతం 540 ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొనుగోలు సెంటరు ఉండాలని, మిల్ ట్యాగింగ్, ట్రాన్స్పోర్ట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో 5 ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఇస్తే ప్రస్తుతం 8 కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని వివరించారు.
- ఇదీ చూడండి: బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ