నిజామాబాద్ జిల్లాలో పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలు కొనసాగుతున్నాయి. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు సంబంధించి స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య నామపత్రాల దాఖలు కొనసాగుతున్నాయి.
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని బాలికల జూనియర్ కళాశాలలో 12 నామపత్రాల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో మూడు వార్డులకు సంబంధించిన నామినేష్లను అధికారులు స్వీకరించారు. 36వ వార్డులో బారడ రమేశ్ (తెరాస), 31వ వార్డు బారెట్టి సౌమ్య (భాజపా), 33వ వార్డు వినీత్ (తెరాస), 30వ వార్డు సుజాత (తెరాస), 6వ వార్డు మురళీధర్‌రెడ్డి (భాజపా) నామపత్రాలు దాఖలు చేశారు.
- ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?