భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఎన్నో సేవలు చేసిన ప్రణబ్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రణబ్ ముఖర్జీతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఎంపీ సురేశ్‌రెడ్డి అన్నారు. ఏ అంశాన్నైనా ప్రపంచీకరణ దృష్టితో చూడటం ప్రణబ్ గొప్పదనమని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రణబ్ ముఖర్జీ పాత్ర ఎనలేనిదని సురేశ్‌రెడ్డి కొనియాడారు.
ఏ మంత్రిత్వశాఖ ఇచ్చినా వన్నెతెచ్చేలా ప్రణబ్ పనిచేశారని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి కొనియారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రణబ్ ముఖర్జీ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు.
ఇవీచూడండి: గొప్ప మేధావిని దేశం కోల్పోయింది: మోదీ