ETV Bharat / state

పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా?: అర్వింద్

mp arvind on rahul: వరంగల్ రైతు డిక్లరేషన్​పై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా? అని సవాల్ చేశారు.

MP ARVIND FIRES ON RAHUL GANDHI
పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా?: అర్వింద్
author img

By

Published : May 7, 2022, 10:35 PM IST

mp arvind on rahul: వరంగల్​లో రైతు డిక్లరేషన్... రియల్ ఎస్టేట్ బ్రోచర్​లా ఉందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్​కు రైతు సమస్యలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకుండా రైతుల పంటలకు మద్దతు ధర ఎలా ఇస్తారని అన్నారు. నైట్​క్లబ్ నుంచి సభకు వచ్చిన రాహుల్... అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటానికి కాంగ్రెస్, తెదేపాలే కారణమని... కాంగ్రెస్ విధానాలతోనే పసుపు ధర పడి పోయిందని ఆరోపించారు. పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా? అని సవాల్ చేశారు.

పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా?: అర్వింద్

'' 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్​కు రైతు సమస్యలు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు. పసుపు బోర్డుపై రాహుల్​కు పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా?'' - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

మరోవైపు నిజామాబాద్ సీపీ క్యాంపు కార్యాలయం ముందు అర్వింద్ ధర్నా నిర్వహించారు. నిజామాబాద్‌ సీపీ కార్యాలయం ముందు బైఠాయించిన ఎంపీ అర్వింద్‌... గ్రామాల్లో తెరాస కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు సీపీ భద్రత కల్పించడం లేదని వెల్లడించారు. సీపీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన చేస్తానని తెలిపారు.

''గ్రామాల్లో తెరాస కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నా పర్యటనకు సీపీ భద్రత కల్పించడం లేదు. సీపీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన చేస్తా..'' - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

సీపీ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై తెరాస కార్యకర్తలు దాడులు చేస్తున్నా... సీపీ భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గతంలోనూ తెరాస కార్యకర్తలు దాడులు చేస్తే వాళ్లని రైతులను చెప్పిన సీపీ.. ఇప్పుడు తెరాస కార్యకర్తలు అడ్డుకుంటామని చెబుతుంటే ఎందుకు వాళ్లని ఆపడం లేదని ప్రశ్నించారు. ఇకపై పర్యటనలకు భద్రత కల్పిస్తామని.. అదనపు డీసీపీ నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఎంపీ ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.