పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, జిల్లా అధికారులు హాజరయ్యారు.
రెండో విడత పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో చేపట్టిన వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డుల పురోగతిపై అధికారులు ఇచ్చిన వివరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: నేడు రాజ్భవన్లో రాష్ట్రపతికి విందు