నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పటిష్టంగా అమలయ్యేలా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని నిజామాబాద్ అదనపు సీపీ అరవింద్ బాబు అన్నారు. నగరంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిని స్వయంగా పర్యటిస్తూ సమీక్షించారు.
నగరంలోని దేవీ రోడ్, గాంధీ చౌక్ చౌరస్తా, వర్ని ఎక్స్ రోడ్, న్యాల్కల్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తాల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలు సీజ్ చేశారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతూ భౌతిక దూరం పాటించడం లేదన్నారు. ఇకపై అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకు లాక్ డౌన్ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: Sticker for vehicle: ఈ-చలాన్లు కట్టాల్సి వస్తుందని ఏం చేశారో తెలుసా!