MP Arvind Bond Papers on KTR Twitter : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ పసుపు రైతులకు రాసినట్లు ఉన్న ఓ బాండ్ పేపర్‌ను తాజాగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్లో షేర్ చేశారు. దానికి 'పసుపు బోర్డు ఇస్తామంటూ రాసిన ఈ బాండ్ పేపర్లను గుర్తు పట్టగలరా' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డును ఇస్తామని బీజేపీ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిందని.. ఆ తర్వాత మర్చిపోయిందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇది రైతులను అత్యంత దారుణంగా అవమానించటమే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ తరువాత రైతులు ఎన్నో ఉద్యమాలు చేసినా పసుపు బోర్డు ఇవ్వకపోవటం దారుణమని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి పసుపు రైతులు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ విమర్శించారు.
-
Real insult to Turmeric Farmers is promising them a Turmeric Board on a Bond Paper at the time of Parliament Elections and then hoodwinking them by refusing to deliver despite numerous protests
— KTR (@KTRBRS) May 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Do you recognise this👇Bond paper promise of your BJP MP from Nizamabad ??
Turmeric… https://t.co/C87FyVyaMM pic.twitter.com/9WjkbrAqzN
">Real insult to Turmeric Farmers is promising them a Turmeric Board on a Bond Paper at the time of Parliament Elections and then hoodwinking them by refusing to deliver despite numerous protests
— KTR (@KTRBRS) May 8, 2023
Do you recognise this👇Bond paper promise of your BJP MP from Nizamabad ??
Turmeric… https://t.co/C87FyVyaMM pic.twitter.com/9WjkbrAqzNReal insult to Turmeric Farmers is promising them a Turmeric Board on a Bond Paper at the time of Parliament Elections and then hoodwinking them by refusing to deliver despite numerous protests
— KTR (@KTRBRS) May 8, 2023
Do you recognise this👇Bond paper promise of your BJP MP from Nizamabad ??
Turmeric… https://t.co/C87FyVyaMM pic.twitter.com/9WjkbrAqzN
Turmeric board in Nizamabad: నిజామాబాద్‌లో పసుపు బోర్డుపై రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఇది వరకే అక్కడ పోటిపోటిగా ఫ్లేక్సీలు ఏర్పాటు.. నేతలకు పసుపు రైతుల నుంచి నిరసన సెగలు.. ఇలా చాలా జరిగాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజంగా చెప్పలంటే నిజామాబాద్ రాజకీయాల్లో పసుపు బోర్డు అంశంతో కొంత ఓటు బ్యాంక్ ముడిపడి ఉందని చెప్పొచ్చు. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పసుపు రైతులను ప్రసన్నం చేసుకోనేందుకు రాజకీయ నేతలు పోటిపడతారు.
దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం ఇక్కడే ఉత్పత్తి: రాజకీయాలను ఓవైపు ఉంచి పసుపు బోర్డు గురించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఎంతో అవసరం. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా పండిస్తున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం నిజామాబాద్ జిల్లాలోనే ఉత్పత్తి అవుతోంది.
పంట సాగు చేసేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుండగా.. సుమారు లక్షన్నర వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. కానీ సరైన మద్దతు ధర లేకపోవడంతో అన్నదాతలు చాలా వరకు నష్టపోతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైతే తమ పంటకు గిట్టుబాటు ధర లభించి తమ కష్టాలు తీరుతాయని రైతుల నమ్మకం.. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్కడ పసుపు బోర్డుకు అంగీకారం తెలపలేదు.
ఇవీ చదవండి: