హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. అక్కడ తమకు భద్రత లేదని, రాత్రివేళ డ్యూటీ ముగించుకుని వెళ్లాలంటే భయమేస్తోందని మహిళా వైద్యులు వాపోతున్నారు.
ఈ విషయంపై ప్రిన్సిపల్ కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే నిరసన చేపట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. శాశ్వత హాస్టల్ సౌకర్యం కల్పించేవరకు ఇది కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
ఇది చదవండి: ఐక్యతతోనే బీసీల ఎదుగుదల సాధ్యం: సారయ్య