Food Poison In Bheemgal Kasturba School : రాష్ట్రంలో ఇటీవల సర్కారు బడుల్లో, కస్తూర్భా పాఠశాలల్లో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. చాలా వరకు కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా గాంధీ పాఠశాలలో కలకలం సృష్టించింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి.. 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్బా గాంధీ పాఠశాల(Food Poison in Bheemgal KGBV) పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు పిల్లలకు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల లక్షణాలు మొదలయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు వసతి గృహం నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే నిర్వాహకులు విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భయాందోళనకు గురైన మరో 68 మంది విద్యార్థులను ముందస్తుగా.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్మూర్ ఆర్డీవో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Girls Fell Sick in Bheemgal KGBV Due to Food Poison : కేజీబీవీలో కలుషిత ఆహారం కలకలం రేపడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి వండిన ఆహార పదార్థాలను పరిశీలించి, అక్కడి విద్యార్థులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహారం కలుషితం((Food Poison) జరిగిందా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
బాలికల వసతి హాస్టల్లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత
'మాకేం కాలేదు.. మేము బాగానే ఉన్నాం. రోజు ఎలా వండుతున్నారో అలానే ఫుడ్ వండారు. నిన్న ఏమైందో తెలీదు కానీ.. నా స్నేహితులతో కలిసి భోజనం చేశాం. 7.40కి స్టడీకి కూర్చున్నాం. 9 గంటల దాకా అందరం బాగానే ఉన్నాం. 9.15 తర్వాత అందరికీ ఉన్నట్టుండి.. కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయి. అందరికీ ఇలా అయ్యేసరికి ఒక్కసారిగా అందరూ ఏడవడం మొదలు పెట్టారు. వెంటనే వార్డెన్ మమ్మల్ని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి మేము బాగానే ఉన్నాం.' -బాధిత విద్యార్థిని
KGBV Girl Students Sick In Bheemgal : విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చారు. హాస్టల్ సిబ్బంది.. విద్యార్థినుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'నిన్న రాత్రి భీంగల్ కాస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి 78 మంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వారందరికీ కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాల లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి అందరికీ బాగానే ఉంది. అందులో మా పాప కూడా ఉంది. ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదుటపడింది.' -బాధిత విద్యార్థి తండ్రి
Food Poison in Wanaparthy KGBV : కలుషిత ఆహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తీని 24 మంది విద్యార్థినులకు అస్వస్థత