నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బుధవారం 50 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద గురువారం లక్ష క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయం 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల మేర నీరు ఉంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 90.31 టీఎంసీల నీటి నిల్వ ఉంది.