కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనందున పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే కొద్దిసేపు తెరిచి ఉంచి, మాంసం విక్రయి కేంద్రాలు మూసేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసం అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు, పురపాలకశాఖ అధికారులు తనిఖీ చేసి రూ. 5 వేలు జరిమానా విధించినట్టు సీఐ మహేష్ గౌడ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: పందిట్లో ఉండాల్సిన వరుడు కరోనా విధుల్లో నిమగ్నమైతే...