డబ్బు చెల్లిస్తే ఉద్యోగం రాదు
ఈ విషయంపై ఆరా తీయగా సతీష్ అనే వ్యక్తి 24 మంది నిరుద్యోగుల వద్ద వేలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అనధికారికంగా అస్పత్రి విధుల్లో నియమించాడు. దీనిపై విచారణ చేపట్టడానికి వచ్చిన డీఎంఈ రమేష్ రెడ్డి... ప్రధాన సూత్రధారి సతీష్‌తో పాటు ఇతరుల ప్రమేయం ఉందని వెల్లడించారు. వారిపైతగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం డబ్బు చెల్లిస్తే రాదని, దానికి అధికారిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
అధికారి ముందే ఫోన్‌తో ఆటలు
ఓవైపు డీఎంఈ విచారణ చేస్తుండగా.. ఒక వైద్యురాలు సెల్‌ఫోన్‌తో ఆడుతూ కన్పించారు. ఆస్పత్రి లోపాల వల్లే నిరుద్యోగులను మోసం చేశారని.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటే.. ఆమె సెల్ఫోన్లో బిజీ ఉన్నారు.
రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఎదురుగా ఉన్నప్పుడే వైద్యులు ఇలా ప్రవర్తిస్తే... ఇక ప్రతి రోజు ఆస్పత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇలాంటి వారు ఉంటే.. ఇక మోసాలకు దారి తీసే అవకాశాలే ఎక్కువ.
ఇవీ చూడండి:ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవి... ఎందుకంటే?