నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ మండలంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నాలుగైదు రోజులుగా ఆహార ప్యాకెట్లు,రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్ల సీసాలును పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్ అన్నదాతలం పేరిట జాతీయ రహదారిపై నడుస్తూ వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ వంతు సహకారంగా విరాళాలు అందజేస్తున్నట్లు ఉమ్మడి మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయని చెప్పారు. ఈరోజు, రేపు పోచంపాడుకు చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ యాజమాన్యం ఆహారాన్ని అందిస్తుందని... అవసరమైన వారు సంప్రదించాలని సూచించారు.