ఇవీ చదవండి:పసుపు రైతుల అరెస్ట్...
కలెక్టరేట్ ముందు ధర్నా - రైతులు
పసుపు, ఎర్రజొన్న రైతుల పోరాటం సాగుతోంది. గిట్టుబాటు ధర కోసం ఇవాళ హైదరాబాద్ బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అరెస్టు చేసిన రైతు కూలీ సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగింది.
కలెక్టరేట్ ముందు ధర్నా
సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎర్ర జొన్న క్వింటాకు రూ.3500, పసుపు పంట క్వింటాకు రూ.15,000 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని పార్టీ నాయకులు కోరారు. రైతుల నిరసనను పోలీసు బలగాలతో అడ్డుకోవడం తగదన్నారు.
ఇవీ చదవండి:పసుపు రైతుల అరెస్ట్...
sample description