ETV Bharat / state

'కొవిడ్​తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం ఇదే మొదటిసారి' - నిజామాాబాద్ వార్తలు

పెళ్లై నాలుగేళ్లు అయింది. పిల్లల కోసం ఎంతగానో పరితపించిన వారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆస్పత్రులు చుట్టూ తిరిగి మందులు వాడగా.. ఆమె గర్భం దాల్చింది. స్కానింగ్​లో ముగ్గురు పిల్లలను తెలిసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ డెలివరీ టైమ్​కి మహిళకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాతా ఏమైందంటే...

covid-patient-given-birth-to-three-kids-in-nizamabad
కొవిడ్​తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం... ఇదే మొదటిసారి
author img

By

Published : Nov 4, 2020, 8:15 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్​కు చెందిన ఓ మహిళ పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత గర్భం దాల్చింది. గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని తేలడంతో ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో అక్టోబర్​ 22న ఆ మహిళ నిజామాబాద్​ ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చింది.

''ఆమె వచ్చే సమాయానికే డెలివరీ టైం దగ్గరపడింది. వెంటనే మా సిబ్బంది ఆమెకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్​ సోకినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి కూడా మేము వెనుకడుగు వేయలేదు. హైదరాబాద్​కు సిఫార్సు చేయకుండానే ట్రీట్​మెంట్ అందించాం. తగిన జాగ్రత్తలతో మహిళకు సిజేరియన్ చేయగా... ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ బిడ్డను జన్మనిచ్చింది. పిల్లలు 1.2, 1.2, 1.5 కేజీల తక్కువ బరువుతో జన్మించారు. వారిని వెంటనే ఆస్పత్రిలోనే ఎన్ఐసీయూలో చేర్చుకుని వైద్యం అందించాము.''

-డా.ప్రతిమారాజ్​, సూపరింటెండెంట్

అనంతరం ఆమెకు, పిల్లలకు చికిత్స అందించినట్లు ప్రతిమా తెలిపారు. పన్నెండు రోజుల తర్వాత మళ్లీ కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా... తల్లీ, పిల్లలకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. దీంతో వారిని ఈ రోజు డిశ్చార్జ్​ చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివ్​తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం రాష్ట్రంలోనే ప్రథమమని తెలిపారు.

కొవిడ్​తో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం... ఇదే మొదటిసారి

ఇదీ చూడండి: 'కొవిడ్- ఫ్లూ : రెండింటికీ ఒకే టెస్ట్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.