రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. పనుల వేగం పెంచాలని అధికారులకు సూచించారు. అక్టోబర్ 20 నాటికి పూర్తి చేయకపోతే సంబంధిత పంచాయతీ రాజ్ శాఖ అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మెట్టు, గొట్టుముక్కల, మాక్లూర్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె పకృతి వనాలను పరిశీలించారు.
రైతు వేదికల పనులు రోజువారీగా ప్రణాళికా ప్రకారం చేయాలన్నారు. ప్రతిరోజు తహసీల్దార్ వీటిని పర్యవేక్షించాలని సూచించారు. దసరాకు రైతు వేదికలు ప్రారంభించుకోవాలని అన్నారు. మాక్లూర్‌లో పల్లె ప్రకృతి పార్కు స్థలము చాలా బాగుందని అభినందించారు.
కలెక్టర్‌తో పాటు ఆర్డీవో రవి, సర్పంచ్ గంగాధర్, ఆంధ్ర నగర్ సర్పంచ్ రామారావు, మాక్లూర్ తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో షాక్రియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు