నిజామాబాద్ కలెక్టరేట్ సముదాయ పనుల వేగాన్ని పెంచాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. దసరా కన్నా ముందే నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. వివిధ పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నగర శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ను సందర్శించారు.
రోడ్డు లెవలింగ్, గ్రౌండ్ లెవెలింగ్, కల్వర్ట్ ఇతర పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు రావడం వల్ల పనుల్లో ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. రోడ్డు, ప్రహారీ గోడ, గేటు, కమాన్ తయారవుతున్నాయని అన్నారు. కలెక్టర్‌తో పాటు ఆర్ అండ్ బీ ఈఈ రాంబాబు, ఆర్డీఓ రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు