కవిగా, పండితునిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, సినీ కవిగా డా. సి.నారాయణ రెడ్డి చేపట్టిన ప్రతి పదవి తరించిపోయిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ అన్నారు. సినారె జయంతి సందర్భంగా... నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సినారె చూపిన బాటలో తెలంగాణ సాహిత్య సమాజం అడుగులు వేసిందన్నారు. ఆ కాలంలో దాశరథితో కలిసి ఏర్పాటు చేసిన తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమలో పలువురు పాల్గొన్నారు.
ఇది చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక