ETV Bharat / state

'కరోనా కట్టడికై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి'

రోజురోజుకూ కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్​లో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. దక్షిణ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ ఎమ్మార్వో హరిబాబుకు వినతిపత్రం అందజేశారు.

author img

By

Published : Jul 23, 2020, 3:42 PM IST

CITU leaders held a dharna in Nizamabad to demand that the government support the people during the Corona period
'కరోనా కట్టడికై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి'

కరోనా వైరస్​ను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఐటీయూ నిజామాబాద్​ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ ఆరోపించారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నిజమాబాద్​ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో హరిబాబుకు వినతి పత్రం అందజేశారు. కొవిడ్​ వైద్యం అనేది పేద ప్రజలకు అందని ద్రాక్ష తయారయ్యిందని గోవర్ధన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోయారని.. ఈ పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని.. రోజువారి కూలీ 600 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ముందుండి సేవచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.