ETV Bharat / state

BRS​కు షాక్​.. తిరిగి సొంతగూటికి చేరిన డీఎస్

author img

By

Published : Mar 26, 2023, 12:39 PM IST

Updated : Mar 26, 2023, 1:53 PM IST

Dharmapuri Srinivas Joined in Congress : బీఆర్​ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో డీఎస్​తో పాటు ఆయన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరోవైపు రాహుల్​పై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీభవన్​లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర అగ్రనాయకులందరూ ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు.

Dharmapuri Srinivas
Dharmapuri Srinivas

Dharmapuri Srinivas Joined in Congress : బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. గాంధీభవన్‌ చేరుకున్న డి.శ్రీనివాస్, ఆయన పెద్ద కుమారుడు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. గాంధీభవన్​లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షలో పార్టీ రాష్ట్ర అగ్రనాయకులందరితో కలిసి డీఎస్ పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీలక నేతగా వ్యవహరించిన డి.శ్రీనివాస్‌.. 2014 తర్వాత రాజకీయ పరిణామాలతో బీఆర్​ఎస్​లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు పొందారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ రాజ్యసభ స్థానం పదవీ కాలం కూడా ముగిసింది. గతంలోనే సోనియాను కలిసిన సందర్భంగా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రచారానికి ముగింపు పలుకుతూ.. తిరిగి తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని డి.శ్రీనివాస్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ గాంధీ భవన్​కు చేరుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా.. వీల్‌ఛైర్‌లో డీఎస్​ గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనతో పార్టీ నేతలు, శ్రేణులు పాత పరిచయం నెమరవేసుకుంటూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రజాక్షేత్రంలో పని చేసే నేతలకు ప్రజలే ముఖ్యమని డి.శ్రీనివాస్ అన్నారు. పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీజేపీ నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న చిన్న కుమారుడు డి.అర్వింద్‌ కుమార్‌కు తన అభినందనలు తెలిపారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వాళ్లిద్దరూ తెలంగాణ రాష్ట్రం, ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని డీఎస్ కితాబిచ్చారు. ఇద్దరూ కూడా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకుంటారన్న విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు.

రాహుల్​గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీభవన్​లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పార్టీ రాష్ట్ర ఇన్​ఛార్జీ మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​ కుమార్​రెడ్డి, సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, వీహెచ్​, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ ఆలీ, పొన్నం ప్రభాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.