నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని శివ ప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిర్మల్ జిల్లా లింబామ్ గ్రామానికి చెందిన శివ నవీపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సైనిక్ స్కూల్ ప్రవేశం కోసం దరఖాస్తూ చేసుకోగా... పరీక్ష రాయొద్దని తల్లిదండ్రులు చెప్పారు.
దీంతో మనస్తాపానికి గురైన శివ ప్రభుత్వ హాస్టల్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన విద్యార్థులు స్థానిక ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమించిందని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.