BJP Chief JP Nadda in Nizamabad Sabha : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ (BJP) నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజామాబాద్లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాట్లాడిన ఆయన తెలంగాణలో దళిత క్షేమం కోసం చేపట్టిన దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్
కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ బీమా ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని వివరించారు. మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం ఐదో స్థానానికి చేరిందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు బోర్డు (Telangana Turmeric Board) ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని దించేది బీజేపీనేనని స్పష్టం చేశారు.
"వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారుతాయి. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ వంచించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రం అభివృద్ధి చెందింది. కేసీఆర్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయమైంది. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం. కుటుంబపాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది." - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
BJP Chief JP Nadda Fires on BRS Government : బీఆర్ఎస్ అంటే భారత రాక్షసుల సమితి అని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. పేదల భూమిని గుంజుకునే పని ధరణి ద్వారా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి ద్వారా వస్తున్న ఇబ్బందులను తొలగిస్తామని.. పేదల భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అని విమర్శించారు.
'కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రులే - వారివి మాత్రం ఆరు గ్యారెంటీలట'
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.38వేల కోట్లని చెప్పి దానికి లక్ష కోట్లు అయ్యిందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులైన పులిమామిడి రాజు, సంగప్పను గెలిపించాలని ప్రజలను కోరారు. మియాపూర్ భూముల్లో అవకతవకలు జరిగాయని ఔటర్ రింగ్ రోడ్లో రూ.వెయ్యికోట్ల అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి రౌడీ రాజ్యాన్ని దోచుకునే కేసీఆర్ను కొనసాగిద్దామా అంటూ ప్రశ్నించారు. మహిళలకు సరైన ప్రాధాన్యత లభించాలన్నా.. ఆర్థిక ప్రయోజనం జరగాలన్నా బీజేపీకి ఓటు వేయాలని కోరారు.
అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయారా?, కేసీఆర్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ
JP Nadda on Modi Ruling : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఔషధాల ఉత్పత్తిని 180 శాతానికి పెంచిందని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలకు ఔషధాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దేశంలో 35 కోట్ల మంది దారిద్ర రేఖ నుంచి పైకి వచ్చారని వివరించారు. 26 లక్షల పేద కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా రెండున్నర లక్షల కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించామన్నారు. ఈ సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు.