భగత్ సింగ్ సుఖ్ దేవ్, రాజ్ గురు వర్థంతి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. 90వ వర్ధంతి సందర్భంగా... పీడీఎస్యూ- పీవైఎల్, ఐఎఫ్టీయూ- ఏఐకేఎంఎస్ నిజామాబాద్ నగర కమిటీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడన్నారు. ఆంగ్లేయ వ్యతిరేక విధానాలను ఖండించి.. స్వేచ్ఛ కాంక్షలను ఆకాంక్షించిన నవ యవ్వన ఆదర్శనీయుడని కొనియాడారు. నేడు దేశంలో కొద్దీ మంది పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్,సుఖ్ దేవ్, రాజ్ గురు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: సభలో.. మాకూ మాట్లాడే అవకాశమివ్వండి: కాంగ్రెస్ నేతలు