రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దనీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వారు పండించిన ధాన్యంలో చివరి గింజ వరకూ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గంలో జీవన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. లబ్ధి దారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఆర్మూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. చేనేత చీరలు తయారు చేయించి తెలంగాణ ఆడపడుచులకు కానుకగా ఇస్తున్నారని అన్నారు. రేషన్ డీలర్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి చీరలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఏ గ్రేడ్ రకం వరికి క్వింటాలుకు రూ. 1,888, బీ గ్రేడ్ రకానికి రూ. 1,868 ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం వచ్చే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: లిఫ్ట్ కోసం తవ్విన గుంతలో పడి బాలుడు మృతి