ETV Bharat / state

Train Accident: రైలు ఢీకొని 55 గొర్రెలు మృత్యువాత.. కాపరికి గుండె కోత.. - కుకునూరు శివారులో విషాదం

అప్పటి వరకు మేసిన గొర్రెలన్ని కాసేపు సేద తీరాయి. ఆ క్షణం వరకు వాటితోనే ఉన్న కాపరి.. నీడ పట్టున కూర్చున్నాడు. ఇంతలోనే మెరుపు వేగంతో వచ్చిన రైలు.. ఏకంగా 55 గొర్రెలను పొట్టనబెట్టుకుంది. ట్రాక్​ మీద ఉన్న గొర్రెలు కళ్ల ముందే.. పిట్టల్లా ఎగిరి పడటం చూసి.. కాపరికి దుఖం ఆగలేదు.

55 goats died due to train colloid at kukunoor

author img

By

Published : Oct 28, 2021, 10:58 PM IST

రైలు ఢీకొని 55 గొర్రెలు మృత్యువాత.. కాపరికి గుండె కోత..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూరు శివారులో విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని 55 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అంక్సాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న బోజెందర్ అనే గొర్ల కాపరి తన గొర్రెలను అంక్సాపూర్​ నుంచి కుకునూరు వెళ్లే మార్గానికి మేత కోసం తీసుకెళ్లారు. మూగజీవాలు మేత మేస్తూ.. అక్కడే ఉన్న ర్వైల్వే ట్రాక్​ మీదికి చేరుకున్నాయి. పడుకోటానికి అనువుగా ఉందనుకున్నాయో ఏమో మరి.. ఆ జీవాలన్ని ట్రాక్​ మీదే కాసేపు సేద తీరాయి.

గొర్రెలన్నీ పిట్టల్లా...

గొర్రెలు విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా అని.. కాపరి కూడా కాసేపు నీడపట్టున కూర్చుండిపోయాడు. ఇంతలోనే మెరుపు వేగంతో రైలు దూసుకొచ్చింది. కాస్త ఏమరుపాటుగా ఉన్న కాపరి ఈ విషయాన్ని గమనించలేకపోయాడు. చూస్తూండగానే.. ట్రాక్​ మీదున్న గొర్రెలన్నీ.. రైలు వేగానికి పిట్టల్లా ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. కాపరి అప్రమత్తం అయ్యేలోపే.. జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసేలోపే ఆ అమాయక మూగజీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

దుఖంతో గొర్రెల కాపారి..

మోర్తాడ్ వైపు నుంచి నిజామాబాద్ వైపు రైలు వస్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాపరి దగ్గరున్న గొర్రెలన్ని ఒకేసారి మృత్యువాత పడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వాటి మీదే ఆధారపడి బతుకుతూ.. తమ పిల్లల్లా కాచుకుంటున్న మూగజీవాలన్ని విగతజీవాలుగా మారటాన్ని చూసి బోజేందర్​.. దుఖంలో మునిగిపోయాడు. ఈ ప్రమాదంతో సుమారు 5 లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.