కార్మికుల హక్కుల సాధనకు ఐక్యతా పోరాటమే నిజమైన మార్గమని సీపీఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. పట్టణంలో సీఐటీయూ జెండాను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని.. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తోందని రమేశ్ బాబు ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థలను.. ప్రైవేటీకరించ వద్దు
ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటీకరిస్తూ.. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఎనిమిది గంటల పనిని 12 గంటలకు మార్చాలని భావిస్తున్నారని.. ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీయటానికి.. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా