నిర్మల్ మున్సిపాలిటీలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదుపై వరంగల్ ఆర్జేడి షాహిద్ మసూద్ దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్ తౌహిద్ ఉద్దిన్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు.
గతంలో పారిశుద్ధ్య సర్టిఫికెట్ల సొమ్ము స్వాహా చేశారని.. మ్యుటేషన్లకు సంబంధించిన రికార్డులు మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భువన్ సర్వేకు చెందిన రూ.4.56 లక్షలు కాజేశారని.. ఇందిరమ్మ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యంగా ఒకే వ్యక్తికి మూడు గదులు అద్దెకు ఇచ్చారని తెలిపారు.
ఇదీ చూడండి: 'పదవీలో లేనప్పుడే సేవ చేసే అవకాశం వస్తోంది'