రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి పలు ప్రాంతాలను పొంగమంచు కమ్మేసింది. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని భైంసా-బాసర రహదారిపై ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి: కొత్త ఏడాదిని కాలగతిలో మేలిమలుపుగా మారుద్దాం