ETV Bharat / state

ఆర్జీయూకేటీలో మళ్లీ విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - నిర్మల్ జిల్లా తాజా వార్తలు

బాసర
బాసర
author img

By

Published : Jul 30, 2022, 10:25 PM IST

21:05 July 30

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

BASARA RGUKT :బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఆర్జీయూకేటీలోని మెస్‌లు ఇ1, ఇ2 ముందు విద్యార్థుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి భోజనం చేయకుండా అలాగే ఉంటామని విద్యార్థులు పేర్కొన్నారు.

కలుషిత ఆహారం ఘటన తర్వాత.. మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందిన సిబ్బంది త్వరలో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ వారు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు. కలుషిత ఆహారంకు సంబంధించిన పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపించారు.. కానీ ఆ నివేదికలోని విషయాలను ఎందుకు బహిరంగ పరచడం లేదో చెప్పాలన్నారు. జూలై 24 నాటికి మెస్‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పారు.. అయినా ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు.

ఇవీ చదవండి: నగరవాసులకు అలర్ట్​.. రేపు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

ట్రాన్స్​జెండర్​తో యువతి పెళ్లి.. బంధువుల షాక్​ ట్రీట్మెంట్​.. హైకోర్టు జోక్యంతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.