ETV Bharat / state

పెరుగుతున్న కేసుల దృష్ట్యా పట్టణాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్​ - corona cases

నిర్మల్​ జిల్లా కుభీర్​ మండల కేంద్రంలో ప్రజలు లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ముథోల్​ నియోజకవర్గంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా... గ్రామ నాయకులు తీర్మానం చేశారు. ఉదయం నుంచే పట్టణంలో వ్యాపారస్థులంతా స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు.

self lock down in kubheer mandal
self lock down in kubheer mandal
author img

By

Published : Jul 23, 2020, 3:50 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... కుభీర్ మండల కేంద్రంలో లాక్​డౌన్​ పాటిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు చేసిన తీర్మానం మేరకు పట్టణంలో స్వచ్ఛంద లాక్​డౌన్ అమలు చేశారు. ఈరోజు ఉండాల్సిన సంతను సైతం రైతులు నిర్వహించలేదు.

ఉదయం నుంచే పట్టణంలో వ్యాపారస్థులంతా స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. శుక్రవారం నుంచి కొన్ని రోజుల వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరిచి... ఆ తర్వాత బంద్ కొనసాగిస్తామని సర్పంచ్​ తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.