నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయం అయ్యప్ప భక్తుల సంకీర్తనలు, శరణు ఘోషతో పులకరించింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన అయ్యప్పను రంగురంగుల పూలతో విశేషంగా అలంకరించారు.
అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి వారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాన్ని ఉంచి బాజా భజంత్రీల నడుమ గ్రామ పుర వీధుల గుండా ఊరేగించారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..