19 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించింది. జిల్లాలోని 14 కంటైన్మైంట్ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు, ప్రజల రాకపోకలు నియంత్రించేందుకు, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు పరిచేందుకు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ నోడల్ అధికారులను నియమించారు.
నిర్మల్ పట్టణంలోని ఆరు కంటైన్మైంట్ జోన్లలో ఆరుగురు నోడల్ అధికారులను నియమించి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్, ఆరుగురు సిబ్బందితో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. అధికారుల వివరాలు,, వారి ఫోన్ నెంబర్లు ప్రకటించారు.
జోన్ పేరు | అధికారి పేరు | స్థాయి | ఫోన్ నెంబర్ |
జోహారనగర్ | డా.వై రమేశ్ | జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి | 7337396421 |
గాజులపేట | కిషన్ | జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి | 7989878995 |
బుధవార్‌పేట | సంతోష్ | మున్సిపల్ డీఈ | 7036661070 |
గుల్జార్ మార్కెట్ | నరసింహారెడ్డి | జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు | 9866213551 |
పాన్‌గల్లి | దేవేందర్ రెడ్డి | జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు | 9440814754 |
చిక్కడపల్లి | సాయిబాబా | జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి | 9441460325 |
కంటైన్మెంట్ జోన్లలోని ప్రజల సౌకర్యార్థం నోడల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇతర అత్యవసర సేవలకై ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.