రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన ప్రదర్శనకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 'బస్ కా పయ్య నహీ చలేగా' అంటూ సకలజనుల సమ్మెను విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని అఖిలపక్షం వారి వెంటే ఉంటుందని చాడ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తెరాసకు మద్దతుపై సీపీఐ పునారాలోచన