హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ నేపథ్యంలో నిర్మల్‌లో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 20 సార్లు అరెస్ట్ చేశారన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేస్తామన్నారు.
ఇవీచూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'