ETV Bharat / state

పునరావాసం లేక పుట్టి మునుగుతోంది.. - రంగారావు జలాశయం తాజా వార్తలు

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలో నిర్మించిన పల్సికర్‌ రంగారావు జలాశయం పూర్తయి మూడేళ్లు అయింది. ముందుచూపు లేకుండా నిర్మించడం వల్ల బ్యాక్‌ వాటర్‌ గ్రామాల్లోకి చేరి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. మూడు సంవత్సరాలుగా ఇక్కడి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాసం విషయంలో ఎలాంటి పురోగతి లేకపోగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పునరావాసం లేక పుట్టి మునుగుతోంది..
పునరావాసం లేక పుట్టి మునుగుతోంది..
author img

By

Published : Aug 24, 2020, 12:14 PM IST

నిర్మల్‌ జిల్లా భైంసాలోని గుండేగాం దిగువన కోతుల్‌గాం-వాడి శివారుల్లో చిన్నసుద్దవాగుపై ప్రభుత్వం పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టును నిర్మించింది. అందులో గుండేగాం పూర్తిగాను, మహాగాం గ్రామం పాక్షికంగాను మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద రావడంతో బ్యాక్‌వాటర్‌ గుండేగాంలోకి చేరింది. సామగ్రి, నిత్యావసరాలు తడిసి పోయాయి. భారీ వర్షాలు రాగానే గుండేగాం గ్రామంలోకి నీరు చేరడం.. బాధితులు మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం వారి కష్టంగా మారింది. రాత్రి పడుకునే చోటు లేక అక్కడి పాఠశాల, బౌద్ధ మందిరాల్లో తలదాచుకున్నారు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పడంతో శిథిలమైన నివాసాలకు మరమ్మతులు చేపట్టడంలేదు. నివాసాలు వర్షాలకు కూలుతున్నాయి. ఇళ్లపై టార్పాలిన్‌ కవర్లు కప్పుకొని వాటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నిబంధనలకు తిలోదకాలు

ప్రభుత్వం ఏ ప్రాజెక్టు నిర్మించినా నిబంధనల మేరకు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభావిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాకే పనులు చేపట్టాలి. అయితే ఇక్కడ అవేమీ లేకుండానే పనులు పూర్తి చేశారు. 2006లో ప్రారంభించిన ప్రాజెక్టుకు పూర్తయ్యే వరకు రూ.37కోట్లు నిధులు వెచ్చించి 2017లో పూర్తి చేశారు. కానీ పునరావాసం కల్పించడంలో వెనుకడుగు వేస్తోంది. ఫలితంగా ఎగువ ప్రాంత గుండేగాం పూర్తిగా, వరదనీరు వచ్చే వాగుల పరివాహక ప్రాంత గ్రామాలు చింతల్‌బోరి, మహాగాం పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి.

గుండెగాం గ్రామాన్ని మూడు రోజుల క్రితం చిన్న నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరయ్య సందర్శించారు. గ్రామ రహదారిపై నిలిచిన నీటిని, ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.12 కోట్లు ఖర్చయినట్లు, ఇంకో రూ.50 కోట్లు వ్యయం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు వల్ల లేని అవస్థలు పడుతున్నామని, వర్షాకాలం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని, తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు వాపోయారు.

ఎవరూ ఆందోళన చెందవద్దు

రంగారావు జలాశయంతో ముంపునకు గురవుతున్న గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాం. సర్వే నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించి నివేదికలను పరిశీలించారు. తాజాగా నిర్మల్‌లో జరిగిన జడ్పీ జనరల్‌బాడీ సమావేశంలో చర్చించి తీర్మానం చేశాం. ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందవద్దు.

- జి.విఠల్‌రెడ్డి, శాసనసభ్యుడు, ముథోల్‌

ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.