కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్కు సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అనిస్ ఖాన్ సహకారంతో మారుమూల గిరిజన గ్రామాలైన బీర్నంది, ఇప్పమాడ, తుమ్మిగూడ గ్రామాల ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయలు ఎస్పీ పంపిణీ చేశారు.
లాక్డౌన్ నేపత్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఖానాపూర్ పోలీసులు వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లగా... వారు పెద్ద మనసుతో నిత్యావసర సరకులు సమకూర్చడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడి ప్రజలు శ్రద్ధ తీసుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. లాక్డౌన్ ముగిసేవరకు అత్యవసరంగా బయటకు వస్తే భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ జైరాం నాయక్, ఎస్ఐ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ