కరోనా వైరస్ నిర్మూలనకు ఔషధం వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో 20 మంది దాతల సహకారంతో తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11 వేల కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, పీఏసీఎస్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ