Nirmal Murder Case Update : ప్రేమ ఇరువురి జీవితాలను ఏకం చేస్తుందనుకుంటే, ఏకంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ కన్నప్రేమ దానికి కారణమైన వారిని బలి తీసుకోవాలనుకుంది. పథకం ప్రకారం దాడికి యత్నించగా, ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృత్యువాతతో ఆ కుటుంబం, హత్యకు పాల్పడి ఈ కుటుంబం చివరికి ఇరు కుటుంబాలను విషాదంలో ముంచింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
డబ్బు కోసం స్నేహితుడి హత్య- పొలంలో పూడ్చేసి మూడేళ్లు నాటకం!
డీఎస్పీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట్ గ్రామానికి చెందిన బుచ్చన్న కుమారుడు నవీన్, అదే గ్రామానికి చెందిన సంటి భీమన్న కుమార్తెను ప్రేమించాడు. ఇది యువతి కుటుంబసభ్యులు ఎవరికీ నచ్చలేదు. వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ కళ్ల ముందు ఉండకుండా వేరే చోటకు వెళ్లి బతకాలని సూచించారు. అయితే వారిద్దరూ ఎక్కడికీ వెళ్లరని, ఇక్కడే జీవిస్తారని నవీన్ తండ్రి యువతి కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో వారిపై కక్ష పెంచుకున్నారు. కొంత కాలం గడిచిన తరవాత ఇటీవలే ఆమెకు సీమంతం చేయడంతో వారు మరింత రగిలిపోయారు. తమ కుమార్తెను తమకు దూరం చేసిన తండ్రి, కుమారుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు.
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!
DCP Gangareddy on Murder Case : ఇందుకోసం ముందే పథకం వేసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బరిసె, గొడ్డలిని సిద్ధం చేసుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూశారు. తండ్రి, కుమారుడు ఇద్దరినీ ఒకేసారి చంపాలన్న ఆలోచనతో ఉన్న భీమన్న, పాలిటెక్నిక్ చదువుతున్న అతడి కుమారుడు ప్రమోద్ దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తండ్రీకుమారులిద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారన్న విషయం తెలుసుకొని నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మీవాడ సమీపంలో వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో బుచ్చన్నతో పాటు అల్లుడైన వెంకటేశ్ బండిపై ఉన్నాడు. నవీన్ దుస్తులు వెంకటేశ్ వేసుకోవడంతో సరిగా పోల్చుకోలేని నిందితులు వెంకటేశ్‌ను నవీన్ అనుకుని ఇద్దరిపై దాడి చేశారు.
''భీమన్న, ప్రమోద్ కలిసి బుచ్చన్న, వెంకటేశ్‌లపై దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే బుచ్చన్న మృతి చెందాడు. అతడి అల్లుడైన వెంకటేశ్ తీవ్రంగా గాయపడి నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, నవీన్ దుస్తులు ధరించి ఉండటంతో వెంకటేశ్‌ను వారు గుర్తించలేకపోయారు. ఈ కారణంగానే అతడిపై దాడి చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశాం. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను నిర్ధారణ చేసుకున్నాం. వారి దగ్గర నుంచి దాడికి ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. వారిని రిమాండ్‌కు తరలించాం. ఘటనలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందనే కోణంలో విచారణ చేస్తున్నాం'' అని డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.
ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం- కూతురు, అల్లుడు, మనవరాలి దారుణ హత్య