నిర్మల్ జిల్లా బైంసా మండలం వట్టోలి సర్పంచ్ జాదవ్ నిఖిత... గ్రామ అభివృద్ధి కోసం సరికొత్త ఆలోచనతో ముందుకుసాగుతున్నారు. వివిధ అభివృద్ధి పనులతో ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆమె... మొట్టమొదటిసారిగా వాకీటాకీలను ఉపయోగించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం... పంచాయతీ కార్యదర్శి, కారోబార్, పారిశుద్ధ్య కార్మికులకు వాకీటాకీలు అందజేశారు. అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వాటిని వినియోగిస్తున్నారు.
గ్రామంలో ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారని, దానిలో భాగంగానే... సర్పంచ్ వినూత్న ఆలోచనతో సిబ్బందికి వాకీటాకీలు ఇచ్చినట్టు స్థానికుడు సచిన్ తెలిపాడు. వీటి వల్ల సమయం వృథా కాకుండా... సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నాడు. సాంకేతికతను ఉపయోగించి సర్పంచ్... గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి అనిత అన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తన్నట్టు వివరించారు.
గ్రామంలోని సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు పారిశుద్ధ్య కార్మికులకు వాకీటాకీలు ఇచ్చినట్టు సర్పంచ్ జాదవ్ నిఖిత తెలిపారు. సమస్య ఎక్కడ ఉన్న వెంటనే తెలియజేస్తే... సత్వర పరిష్కారం చూపిస్తున్నట్టు చెప్పారు. కార్మికులు ఎక్కడున్నా అందరితో ఒకేసారి మాట్లాడి... పని పురమాయించొచ్చని వివరించారు. గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేనందుకు... సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి