నిర్మల్ జిల్లాలో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ సి.శశిధర్ రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉత్తర్ ప్రదేశ్కు చెందిన వలస కూలీలను ప్రత్యేక ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీలను ప్రత్యేక బస్సులో వారి స్వస్థలాలకు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. కాలి నడకన వెళ్లే వలస కూలీలకు కావల్సిన సహకారాలు నిరంతరం అందిస్తున్నామని... ఎవ్వరు అధైర్యపడవద్దని సూచించారు.
మాస్కులు లేకుండా ఎవ్వరు కూడా బయట తిరగొద్దని... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సోన్ మండలం గంజల్ టోల్ ప్లాజా వద్ద సోన్ సీఐ జీవన్ రెడ్డి, ఎస్సై రవీందర్ ద్వారా వలస కూలీలకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు.