నిర్మల్ జిల్లాలో 2020-21 వానాకాలానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం నిర్మల్లో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 178 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం'