నిర్మల్ జిల్లా కేంద్రం భీమన్న గుట్ట సమీపంలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గుట్ట సమీపంలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిలో రహదారి వేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో తమ పశువులను మేపే వాళ్లమని, అది ప్రభుత్వానికి చెందినదని... దానిలో పాగా వేసేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: గొడ్డలితో నరికి దారుణ హత్య