ETV Bharat / state

ఎమ్మెల్యే రేఖానాయక్​కు నిరసన సెగ.. గోబ్యాక్ అంటూ విపక్షాల నినాదాలు​ - కొట్టుకుపోయిన పసుల వంతెన

mla rekha naik gherav: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు నిరసన సెగ తగిలింది. ఇటీవల కురిసిన వర్షాలకు పసుల వంతెన కొట్టుకుపోగా ముంపుప్రాంతం సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యేను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్, అంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు నిరసకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

mla rekha naik gherav
mla rekha naik gherav
author img

By

Published : Jul 20, 2022, 5:31 PM IST

mla rekha naik gherav: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పసుల వంతెన ఇటీవల వరదలకు కొట్టుకుపోయింది. అక్కడి ముంపు ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్యే రేఖానాయక్​ వెళ్లారు. ఎమ్మెల్యేకు ముడుపులు అప్పజెప్పి గుత్తేదారు నాసిరకంగా నిర్మించడం వల్లే వంతెన కొట్టుకుపోయిందంటూ భాజపా, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంతేకాకుండా అవినీతిని ప్రశ్నిస్తున్న గిరిజన నాయకులపై అక్రమకేసులు నమోదు చేస్తున్నారంటూ గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు.

అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే వర్గీయులు, విపక్షాల కార్యకర్తల మధ్య తోపులాట చేటుచేసుకుంది. ఓ దశలో ఎమ్మెల్యే సైతం నిరసనకారులపై వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. గిరిజనుల దశాబ్దాల కల అయిన పసుల వంతెనను నాసిరకంగా నిర్మించారని స్థానికులు వాపోయారు. ఎమ్మెల్యేకు గుత్తేదారు ముడుపులు అప్పగించి నాసిరకంగా నిర్మించాలని అందుకే వరదలకు కొట్టుకుపోయిందని మండిపడ్డారు. ఇలాగే అవినీతికి పాల్పడుతుంటే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే రేఖానాయక్​కు నిరసన సెగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.