నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన తందూరి ఛాయ్ స్టాల్‌ను రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. కొంతం గంగాధర్ అనే యువకుడు చేసిన ఛాయ్‌ను మంత్రి రుచిచూశారు. కుటుంబ సభ్యులతో కలిసి తందూరి ఛాయ్ దుకాణానికి వెళ్లి ఛాయ్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
మట్టి పాత్రలను ఉపయోగించడం ద్వారా శరీరానికి మేలు జరుగుతోందని ఆయన తెలిపారు. నిర్మల్ ప్రజలకు తందూరి ఛాయ్‌ను పరిచయం చేసి, ఉపాధి పొందుతున్న యువకుడిని మంత్రి అభినందించారు.
ఇదీ చూడండి: సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి