విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని... ప్రతి ఒక్కరూ చదువుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్చందా మండలం మల్లాపూర్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.28 లక్షలతో చేపట్టిన 4 అదనపు తరగతి గదులను మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ఉందని మంత్రికి వివరించగా... వెంటనే స్పందించిన మంత్రి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా మరుగుదొడ్ల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చదవండి: నిరుద్యోగులను తెరాస మోసం చేసింది: జానారెడ్డి